ఖాజాపూర్, సెప్టెంబర్ 17 (V1 న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బోధన్ ఆర్డీఓ శ్రీమతి యం. విజయకుమారి గురువారం సాలూర మండలం ఖాజాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో రీ సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే విధానం తదితర అంశాలపై రైతులకు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ విజయకుమారి మాట్లాడుతూ, రీ సర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత స్పష్టంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గ్రామసభలో పాల్గొన్న రైతులు రీ సర్వే ప్రక్రియకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు తగిన సమాధానాలు అందిస్తూ, రీ సర్వేకు సహకరించాలని కోరారు. భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు సర్వే ప్రక్రియలో రైతుల భాగస్వామ్యం, సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారులు, సాలూర మండల తహశీల్దార్, మండల సర్వేయర్, మండల గిర్దావర్, లైసెన్స్డ్ సర్వేయర్లు, ఖాజాపూర్ సర్పంచ్, గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







