-- --

మారుతి మందిరంలో రేపు వృషభ కళ్యాణం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకుల పిలుపు

బోధన్, సెప్టెంబర్ 9:
శ్రావణమాసం చివరి రోజున వచ్చే ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో గురువారం (సెప్టెంబర్ 10) వృషభ కళ్యాణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, నిర్వాహకులు తెలిపారు.

వ్యవసాయంతో ముడిపడిన సంప్రదాయాల్లో భాగంగా వృషభేశ్వరుడు, నందీశ్వరుడిగా భావించే ఎడ్లను పూజించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఆలయంలో వృషభ కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆలయానికి ఆనుకుని ఉన్న అజయ్ వడియార్ వంశస్తుల ఇంటి నుంచి ఎడ్లను తీసుకొచ్చి మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమని వివరించారు. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం వృషభ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

గురువారం జరిగే కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై వృషభ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి పురపాలక సంఘం, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

దేవాలయ కార్యనిర్వహణ అధికారి నాయకం రాములు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ వాహరాజ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు.

భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వృషభ కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more