-- --

.105 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, సెప్టెంబర్ 8: బోధన్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని మంగళవారం బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెసీలో నిర్వహించారు. ఆలింకో (ALIMCO) ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో బోధన్, ఎడపల్లి, రెంజల్, సాలూర, రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, చందూర్ మండలాలకు చెందిన 105 మంది దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆలింకో నిపుణుల బృందం విద్యార్థులను వైద్యపరంగా పరిశీలించి, వారి వైకల్యం, అవసరాలకు అనుగుణంగా అందించాల్సిన సహాయ ఉపకరణాలను గుర్తించి నిర్ధారించింది. శారీరక వైకల్యం, మస్తిష్క పక్షవాతం కలిగిన 38 మంది, వినికిడి సమస్యలు ఉన్న 10 మంది, దృష్టి వైకల్యం ఉన్న నలుగురితో పాటు ఇతర ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు.

విద్యార్థులకు అవసరమైన వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, దృష్టి సంబంధిత సహాయ పరికరాలు తదితర ఉపకరణాలను గుర్తించే ప్రక్రియను నిపుణులు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి బోధన్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ నాగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి విద్యలో ముందుకు సాగేందుకు అవసరమైన సహకారం అందించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త శ్రీ శ్రీనివాసరావు, ALIMCO బృంద సభ్యులు ప్రతుష్ కుమార్ బిస్వాల్, శివకుమార్, బోధన్ ఆర్టీసీ ఏజెంట్ నందం, రిసోర్స్ పర్సన్స్ విజయ్, యూసుఫ్ అలీ, స్పెషల్ ఎడ్యుకేటర్ డా. విశ్వనాథ్ మహాజన్, వివిధ మండలాలకు చెందిన ప్రత్యేక అవసరాల విద్యార్థుల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దివ్యాంగ విద్యార్థులకు విద్యతో పాటు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించడం ద్వారా వారు స్వయం ఆధారితంగా, ఆత్మవిశ్వాసంతో విద్యను కొనసాగించేందుకు, సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు ఇటువంటి శిబిరాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more