ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా.. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్
బోధన్, సెప్టెంబర్ 7: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆచన్‌పల్లి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అయేషా ఫాతిమా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం ఏర్పడి సుమారు 1,000 రోజులు గడుస్తున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
హామీల అమలును డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వెళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఆమె తప్పుబట్టారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండలాల అధ్యక్షులు సంజీవ్, నర్సింగ్‌రావు, శ్రీరామ్, భూమారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మి, అశోక్‌రెడ్డి, మోబీన్, నాయకులు తెడ్డు పోశెట్టి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







