-- --

బోధన్ మారుతి మందిరంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడి.. విజేతలకు ప్రత్యేక బహుమతులు…

ఉన్న చోటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది.”

బోధన్: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన మారుతి మందిరంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2005 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. చిన్నారుల వేషధారణలు, కృష్ణుడి లీలలను ప్రతిబింబించే ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నిర్వాహకులు ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.

ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా, కార్యనిర్వహణ అధికారి రాములు పర్యవేక్షించారు. తిరంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేష్ చిన్నారులకు ప్రత్యేకంగా మెమెంటోలు అందజేశారు.

కార్యక్రమంలో వార్డు 15 కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి, శివాలయం చైర్మన్ లక్ష్మణరావు పటేల్, ఆలయ సిబ్బంది, భక్తులు, స్థానికులు పాల్గొని శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం చిన్నారుల సందడితో, భక్తుల హరిదాసు కీర్తనలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more