ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం: లబ్ధిదారులు…
బోధన్, సెప్టెంబర్ 4 (V1 న్యూస్): బోధన్ పట్టణంలోని 13వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 13వ వార్డు కౌన్సిలర్ లంక రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మాశారత్ రెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు
.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళల సంక్షేమం, పేద–మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం పొందిన పి. విజయ, డి. విజయలు మాట్లాడుతూ తమ సొంతింటి కల సాకారమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో బోధన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, కౌన్సిలర్లు చిరంజీవి, జహీర్, ప్రసాద్, కిషోర్, బోధన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి నవీన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







