Post Views: 25
శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు
బోధన్: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని బోధన్ గంజ్‌రోడ్‌లోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, అర్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







