కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారుల సందడి.. ఆటపాటలతో అలరించిన బాలలు
బోధన్: బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర నగర్ అంగన్వాడి కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిన్నారులు ఆటలు, పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు. అంగన్వాడి సిబ్బంది శ్రీకృష్ణుడి జన్మ విశిష్టత, గోకుల లీలలు, శ్రీకృష్ణాష్టమి పండుగ ప్రాధాన్యతను చిన్నారులకు వివరించారు.

అనంతరం చిన్నారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల అవగాహన, భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల ఆటపాటలతో అంగన్వాడి ప్రాంగణం సందడిగా మారింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







