TVS XLపై తరలిస్తుండగా పట్టుకున్న బోధన్ రూరల్ పోలీసులు.. 65 ఏళ్ల వ్యక్తి అదుపులో
బోధన్: సాలురా చెక్‌పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని బోధన్ పట్టణానికి సరఫరా చేసేందుకు తీసుకువస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బోధన్ పట్టణానికి ఓ వ్యక్తి TVS XL వాహనంపై గంజాయిని తీసుకువస్తున్నాడనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి సాలురా చెక్‌పోస్ట్ వద్ద నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి (65) అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతని వద్ద సుమారు 4 కేజీల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.


గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్నట్లు బోధన్ రూరల్ పోలీసులు తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







