Post Views: 31
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యల్లో భాగంగా సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు గురువారం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండ పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది అంజాద్, గంగాధర్, శ్రావణ్, రమేష్ లు ఉన్నారు.
Author: anantoji Kalidas
Ananthoji kalidas Telangana-Maharastra Beuro Mobile number:-+91 99214 04070







