-- --

తె.యూ. భూముల్లో వ్యవసాయ కళాశాల నిర్మాణం ఆపాలి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రత్యేక ప్రభుత్వ భూమి కేటాయించాలి.. బదలాయింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి: PDSU

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాల భవన నిర్మాణాన్ని తెలంగాణ యూనివర్సిటీ (తె.యూ.) ప్రాంగణంలో చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్, యూనివర్సిటీ నాయకులు జి. నితిన్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ భూముల్లో వ్యవసాయ కళాశాల భవన నిర్మాణానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్ భూమిపూజ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీని అప్పటి ప్రభుత్వం కేటాయించడం ద్వారా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశం లభించిందన్నారు. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అయితే, ఆ కళాశాల కోసం తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100కు పైగా ఎకరాల భూమిని కేటాయించి, బదలాయింపు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని, సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాల ద్వారా వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

అయితే వ్యవసాయ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం వల్ల రెండు విద్యాసంస్థల అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికే భవనాలు, ఇతర మౌలిక వసతుల కొరత ఉందని, కొత్త కోర్సులు ప్రారంభించేందుకు మరిన్ని భవనాలు, సౌకర్యాలు అవసరమని అన్నారు. యూనివర్సిటీలో నీటి సదుపాయం కూడా పూర్తిస్థాయిలో లేదని, ప్రభుత్వం తె.యూ. అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

వ్యవసాయ కళాశాల భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉన్నందున ప్రయోగాత్మక పంటల సాగు, పరిశోధనలు, ప్రయోగశాలలు తదితర అవసరాలకు విస్తృతమైన భూమి, నీటి వసతి, ఇతర వనరులు అవసరమవుతాయని PDSU నాయకులు అన్నారు. రెండు విభిన్న విద్యాసంస్థలను ఒకే ప్రాంగణంలో నిర్వహించడం వల్ల ఇరువురి అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ యూనివర్సిటీ భూములను వ్యవసాయ కళాశాలకు బదలాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ కళాశాల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ భూమిని కేటాయించాలని PDSU నాయకులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు.

ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే విద్యార్థులు, ప్రజలు, రైతులను ఐక్యం చేసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో PDSU జిల్లా ఉపాధ్యక్షురాలు జి. వైష్ణవి, జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు దీపిక, శ్రావ్య, హేమాంజలి, మనితేజ, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more