-- --

ఇసుక వాహనాలపై చర్యలా.. సెటిల్మెంట్లా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

వాహనాలను పట్టిస్తున్న జర్నలిస్టు.. యజమానులతో కుమ్మక్కై విడిపిస్తున్నాడనే ఆరోపణలు

సాలురా: సాలురా మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జరుగుతున్న తనిఖీల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓ జర్నలిస్టు ఇసుక వాహనాల సమాచారాన్ని అధికారులకు చేరవేసి వాహనాలను పట్టిస్తున్నాడని, అనంతరం అదే వాహనాల యజమానులతో సంప్రదింపులు జరిపి అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి వాహనాలను విడిపిస్తున్నాడనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికారులదే. గత ఆరు నెలల్లో పట్టుబడిన ఇసుక వాహనాల వాహన నంబర్లు, యజమానుల వివరాలు, జరిమానా రసీదులు, కేసు నంబర్లు, సీజ్–విడుదల వివరాలు పరిశీలిస్తే అసలు వ్యవహారం బయటపడే అవకాశం ఉంది.

అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా లేదా మైనర్లు నడుపుతున్న వాహనాలపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జర్నలిస్టుపై నిఘా ఎవరు పెడతారు?

అధికారులకు సమాచారం ఇచ్చి వాహనాలను పట్టించేది కూడా, అనంతరం యజమానులతో మాట్లాడి వాటిని విడిపించే వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పాత్రపై స్వతంత్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

జిల్లా ఉన్నతాధికారులు గతంలో పట్టుబడిన వాహనాల రికార్డులను క్రాస్‌చెక్ చేసి, ఎంత జరిమానా విధించారు? ఎంత మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరింది? ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్ని వాహనాలు సీజ్ చేసి, ఎన్ని విడుదల చేశారు? అనే వివరాలను బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ రవాణాను అరికట్టాల్సిన వ్యవస్థలోనే సెటిల్మెంట్ ఆరోపణలు వినిపించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు.. అసత్యమైతే ఆరోపణలకు ఆధారాలేమిటో తేల్చడం—ఇదే ఇప్పుడు అధికారుల ముందున్న అసలు బాధ్యత.
पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more