PRC, పెండింగ్ DAలు, బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం
నిజామాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట TGEJAC ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుమారు 2,000 మంది పాల్గొన్న ఈ ధర్నా సందర్భంగా తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు.
ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుమన్‌తో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, BTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బి. స్వామి నాయక్, ప్రధాన కార్యదర్శి ఎన్. సాయిలు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి. సాగర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ పవర్ తదితరులు పాల్గొని ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా నాయకులు PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 6 DAలను తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి ఉద్యమ హెచ్చరిక
BTF జిల్లా అధ్యక్షుడు బి. స్వామి నాయక్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో “చలో హైదరాబాద్” మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఉద్యోగ–ఉపాధ్యాయ–పెన్షనర్ల ఐక్యతతో నిర్వహించిన ఈ మహాధర్నా.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా సాగింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







