Post Views: 92
“వాన పడితేనే వనం పచ్చగా.. భక్తి ఉంటేనే ఊరు సుభిక్షంగా.”
:
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హున్సా గ్రామంలో సాంప్రదాయ ఊర పండగ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను ఆరాధించారు.
ఉదయం నుంచే మహిళలు నైవేద్యాలను సిద్ధం చేసి, డప్పు వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఎల్నినో వంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా ప్రకృతి అనుకూలించాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని భక్తులు ప్రార్థించారు.
గ్రామ ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచే ఈ ఊర పండగలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. భక్తి, సంప్రదాయం, గ్రామీణ సంస్కృతి కలబోసిన ఈ వేడుక గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








