“కిందిస్థాయి అధికారుల సహకారంపై ఆరోపణలు… ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ చేపట్టాలనే ప్రజల డిమాండ్”
“నేరానికి అండ ఉంటే నేరస్థుడి ధైర్యం పెరుగుతుంది… చట్టం మౌనంగా ఉంటే సమాజమే మూల్యం చెల్లిస్తుంది!”

“గతంలో పోలీసుల వరుస దాడులతో మహారాష్ట్రకు పారిపోయిన జూద ముఠాలు… మళ్లీ జిల్లాలో ప్రత్యక్షమయ్యాయా?”
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాకు ఇటీవల కొత్త ఎస్పీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్కడ పేకాట, జూద స్థావరాలపై వరుస దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్కడ కార్యకలాపాలు కొనసాగించడం కష్టంగా మారడంతో కొంతమంది జూద నిర్వాహకులు మళ్లీ తెలంగాణ సరిహద్దు మండలాల వైపు మకాం మార్చుతున్నారనే సమాచారం స్థానికంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పేకాట స్థావరాలు తిరిగి చురుకుగా మారుతున్నాయనే ఆరోపణలతో పాటు, కొందరు కిందిస్థాయి అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాడులకు ముందు సమాచారం లీక్ అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, సరిహద్దు మండలాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అక్రమ జూదాన్ని అరికట్టడంతో పాటు ఎవరైనా అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“నేరానికి అడ్డుకట్ట వేయాలంటే నిర్వాహకులే కాదు… వారికి అండగా నిలిచే వారిపైనా చట్టం ఒకేలా పనిచేయాలి” అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
“జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ జూదాన్ని అరికట్టడంతో పాటు సహకరిస్తున్న వారిపై కూడా నిష్పాక్షిక విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







