June 30, 2026 12:57 am

V1News Telangana

రైతు నవ్వితేనే రాష్ట్రము నవ్వుతుంది… వాన కురిస్తే పంట పండుతుంది!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

వర్షంతో ఖరీఫ్ సాగుకు శ్రీకారం… రైతుల్లో చిగురించిన ఆశలు

సాలూర మండలం, జూన్ 29 :

నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో కురిసిన వర్షం రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. గత నెల రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఎట్టకేలకు పొలాల్లోకి దిగి ఖరీఫ్ సాగు పనులను ప్రారంభించారు. భూమిలో తేమ ఏర్పడటంతో సోయాబీన్, మొక్కజొన్న, పత్తి తదితర పంటల విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు.

సాలూర గ్రామానికి చెందిన రైతు మైదాపు రాజు తన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో సోయాబీన్ విత్తనాలు వేశారు. గత నెల రోజులుగా వర్షాభావం కారణంగా సాగు పనులు ప్రారంభించలేకపోయామని, తాజాగా కురిసిన వర్షంతో నేలలో తగినంత తేమ ఏర్పడటంతో వెంటనే విత్తనాలు వేశామని తెలిపారు.

ఇకపై కూడా సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు ఆశాజనకంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం కురిసిన వర్షాలతో సాలూర మండలవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సీజన్‌లో వర్షాలు అనుకూలిస్తే రైతులకు మెరుగైన దిగుబడులు లభించి, ఆర్థికంగా లాభదాయకమైన సంవత్సరం అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ వ్యవసాయ సందడి నెలకొనడంతో రైతుల ముఖాల్లో ఆశల వెలుగు కనిపిస్తోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more