నిజామాబాద్, జూన్ 29:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వారిని అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పదోన్నతి అనేది మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేసే అవకాశమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ, పదోన్నతి పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు:
- జి. లింగం (పీసీ నెం. 1744), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్.

- బి. శివకుమార్ గౌడ్ (పీసీ నెం. 265), రుద్రూర్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









