బోధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, గ్యాస్ ఐరన్ బాక్స్‌ల పంపిణీ
బోధన్, జూన్ 29 (వార్తా ప్రతినిధి):
స్వయం ఉపాధిని ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో బోధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, గ్యాస్ ఐరన్ బాక్స్‌ల పంపిణీ కార్యక్రమం సోమవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఆర్డీవో శ్రీమతి విజయకుమారి మరియు బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి తూము పద్మావతి హాజరై అర్హులైన లబ్ధిదారులకు 6 కుట్టు మిషన్లు, 4 గ్యాస్ ఐరన్ బాక్స్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో విజయకుమారి మాట్లాడుతూ, అందించిన ఉపాధి పరికరాలను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రోటరీ క్లబ్ సభ్యులను ఆమె అభినందించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మావతి మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలు, అవసరమైన వారికి చేయూతనిచ్చే రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
Rotary Club of Bodhan అధ్యక్షుడు ఓంకార్ శ్రీనివాస్ రాజు, కార్యదర్శి అల్లే రమేష్, కోశాధికారి తూము రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







