Post Views: 19
భరత్ చంద్ర స్కూలు ఘటన నేపథ్యంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరిక…

నిజామాబాద్, జూన్ 29:
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూలులో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (పాత సెక్షన్ 144 సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ 29, 30 తేదీల్లో పిలుపునిచ్చిన బంద్, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు తదితర కార్యక్రమాలను నిషేధించినట్లు తెలిపారు. ప్రజాశాంతికి ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సెక్షన్ 163 అమలులో భాగంగా జూన్ 29 ఉదయం 6 గంటల నుంచి జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు ఆర్మూర్ పట్టణంలో ఐదుగురికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా, పట్టణంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పీఆర్‌ఓ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








