బోధన్, జూన్ 28:
చిన్నారులను పోలియో వ్యాధి నుంచి సంపూర్ణంగా రక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం బోధన్ పట్టణంలోని 29వ వార్డులో ఉన్న ఏరియా ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాషా, పావులూరి నాగవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డా. సమత రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. దివ్య, క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







