Post Views: 103
బోధన్ లో కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

బోధన్ జూన్ 28 : బోధన్ పట్టణంలోని కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని గ్రామ దేవతల పాటలు పాడుకుంటూ మంగళహారతులతో మహాలక్ష్మి మందిరానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. జరిగింది. అనంతరం కుమ్మరి శాలివాహన సంఘం ఉపాధ్యక్షులు మీర్ దోడ్డి భూమేష్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లపాపలతో, సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు మంచిగా పండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మీర్ దోడ్డి శంకర్, హనుమాండ్లు, సురేష్, విజయ్, దేవేందర్, బాలకృష్ణ, శివరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.







