June 22, 2026 11:57 pm

V1News Telangana

బోధన్‌లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం.. సభ్యత్వ నమోదు, ఓటరు జాబితాపై కార్యకర్తలకు దిశానిర్దేశం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 22 (ప్రతినిధి):

బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ నివాసంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అధ్యక్షతన బోధన్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజి గౌడ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ ప్రక్రియపై కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వివిధ మండలాల అధ్యక్షులు సంజీవ్ కుమార్, నర్సింగ్‌రావు, శ్రీరామ్, కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, ముషీర్ బాబా, మోబీన్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

“సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి.. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి” అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more