June 22, 2026 11:57 pm

V1News Telangana

ప్రభుత్వ జేసీ పాఠశాల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి: బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతిపత్రం – విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యమని ఆరోపణ..

బోధన్, జూన్ 22 (ప్రతినిధి): బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు, కో-కన్వీనర్ సంజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఆ నిధులు విద్యార్థుల సంక్షేమానికి వినియోగించలేదని ఆరోపించారు.

పాఠశాల నిధులను దుర్వినియోగం చేసి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని వారు పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాల అడ్మిషన్లకు సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని, తాము ప్రశ్నించగా నకిలీ ఆధారాలు, ఫేక్ బిల్లులు చూపిస్తూ ఖర్చులు చేసినట్లు పేర్కొనడం సమంజసం కాదని విమర్శించారు.

ప్రస్తుతం కూడా పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి, దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత మొత్తాన్ని తిరిగి పాఠశాల ఖాతాలో జమ చేయించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్. బాలరాజ్, కిరణ్, ప్రశాంత్, రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more