రాత్రి వేళల్లో ధాబాల్లో నిబంధనలకు తూట్లు – బాటసారుల్లో భద్రతపై ఆందోళన.
.
నిజామాబాద్, బోధన్: బోధన్ పట్టణంలో అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల మెట్ల వద్ద కొందరు వ్యక్తులు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గుమిగూడి మట్కా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వీక్లీ మార్కెట్‌కు వచ్చే ప్రజలు, కూరగాయల కొనుగోలుదారులు, బాటసారులు ఈ పరిస్థితి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోతున్నారు. కొందరు వ్యక్తులు బహిరంగంగానే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా, బోధన్ పట్టణ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన ఉన్న కొన్ని ధాబాల్లో రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిర్ణీత సమయ పరిమితులు దాటిన తర్వాత కూడా సీటింగ్‌లు కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితి బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ తగిన పర్యవేక్షణ లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు, చిన్న చిన్న తప్పిదాలపై సాధారణ ప్రజలపై కఠినంగా వ్యవహరించే వ్యవస్థ, ఇలాంటి ఆరోపణల విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలని కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.“

“ఒక్కరికే కాదు… అందరికీ ఒకే చట్టం అమలైతేనే ప్రజలకు న్యాయం.”
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








