May 4, 2026 7:07 pm

V1News Telangana

అన్నదాత చెమట సొమ్ముపై జూదగాళ్ల దాడి..! పంట డబ్బులు ‘ముక్కలాట’లో మాయం—యంత్రాంగం మౌనం ఎందుకు?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మద్నూర్–బాన్సువాడ ప్రాంతాల్లో పేకాట ముఠాల అడ్డాలు
అమాయక రైతులే లక్ష్యం… “డబ్బులు రెట్టింపు” మాయలో చిక్కుకుంటున్న బాధితులు
అటవీ ప్రాంతాల్లో లక్షల రూపాయల జూదం—పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు..

చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుని వచ్చిన రైతు సొమ్ము, ఇంటి గడప దాటకముందే జూదగాళ్ల చేతుల్లోకి జారిపోతున్న దారుణ పరిస్థితి మద్నూర్, బాన్సువాడ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ధాన్యం విక్రయాల ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుండటాన్ని ఆసరాగా చేసుకుని, పేకాట ముఠాలు అమాయక రైతులను లక్ష్యంగా చేసుకుని దందా సాగిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మద్నూర్ మండలంలోని హిప్పర్గ–మంజీరా తీర ప్రాంతాలు, బాన్సువాడ పరిధిలోని కోయగుట్ట, బోర్లం అటవీ ప్రాంతాలు ప్రస్తుతం పేకాట కేంద్రాలుగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ ప్రాంతంలో కృష్ణ, శివాజీ ముఠాలు… బాన్సువాడలో అంత్య గ్యాంగ్ ప్రభావం పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. “డబ్బులు రెట్టింపు అవుతాయి” అనే మాయ మాటలతో రైతులను ప్రలోభపెట్టి, వారిని పేకాటలోకి లాగుతున్నారని బాధితులు చెబుతున్నారు.
మంజీరా నది తీరంలోని ఇసుక దిబ్బలు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఈ అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నా, ఈ దందాను అరికట్టాల్సిన యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పోలీసుల కదలికలను ముందుగానే తెలుసుకునేందుకు ముఠాలు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని, బహిరంగంగానే పేకాట కొనసాగిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా, అటవీ ప్రాంతాల్లో కనీసం కూంబింగ్ చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఇది బాధ్యత వహించాల్సిన అధికారుల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
రైతు చెమట సొమ్ము క్షణాల్లో మాయమవుతూ కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్న ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. పేకాట ముఠాలపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత రైతులకు రక్షణ కల్పించకపోతే, ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా స్పందించండి—అన్నదాతను కాపాడండి

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more