May 4, 2026 5:24 pm

V1News Telangana

బోధన్ వైపు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా… అధికారుల నిర్లక్ష్యమా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రాత్రి–ఉదయం మార్గాలుగా మారిన గ్రామ రహదారులు • చెక్‌పోస్టుల లేమితో పెరిగిన దందా • స్థానికుల ఆగ్రహం..

నిజామాబాద్ జిల్లా సాలురా మండలం పరిధిలోని మంజీరా మంధర్నా ప్రాంతం నుండి బోధన్ వైపు ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి, ఉదయం వేళల్లో పెంట గ్రామం మీదుగా చెక్కి క్యాంప్, గోదాంల ముందు ప్రాంతం, చెక్కి చెరువు దారి, హెడ్ పోస్ట్ ఆఫీస్ రేం‍జల్ బేస్, రవి గార్డెన్, రకాస్‌పేట్, గంజ్, ద్వారక నగర్ మార్గాల ద్వారా ట్రాక్టర్లు, చిన్న వాహనాల్లో ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రధాన రహదారులు కాకుండా గ్రామాల మధ్య దారులను వినియోగిస్తూ ఈ అక్రమ రవాణా కొనసాగుతుండటంతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో భారీగా వాహనాలు సంచరిస్తుండటంతో భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, పోలీసు మరియు రెవెన్యూ శాఖల కొంతమంది సిబ్బంది సహకారంతో ఈ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు కూడా పలువురు ఆరోపించడం గమనార్హం.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కీలక మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more