కాల్పుల దోపిడీ తర్వాత నగరమంతా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా!

కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పులు, దోపిడీ ఘటన అనంతరం పోలీసులు నగరవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, శివారు ప్రాంతాలు, బయటి మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి దుండగుల కదలికలపై ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తుండగా, ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
కాల్పుల దోపిడీతో కరీంనగర్ ఉలిక్కిపాటు.. నిందితుల వేటలో పోలీసులు ఫుల్ అలెర్ట్!
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







