Post Views: 112
నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం.
: రిబ్బన్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి.
బోధన్ : బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి,భోదన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.రాజీవ్ నగర్ తాండ గ్రామంలో గోశాల నిర్మాణానికి భూమి పూజను చేశారు.గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గజమాలతో సన్మానిస్తున్న గ్రామ నాయకులు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి,పిసిసి డెలిగేట్ గంగా శంకర్,డిపిఓ శ్రీనివాస్,ఇరిగేషన్ డిఈ,డిఎల్పీవో నాగరాజు,బోధన్ ఎంపీడీవో మధుకర్,తహసిల్దార్ విఠల్,మండల అధ్యక్షులు నాగేశ్వరరావు,బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి,పెగడాపల్లి వీడిసి చైర్మన్ లక్ష్మారెడ్డి,వైస్ చైర్మన్ సంజీవ్,ప్రధాన కార్యదర్శి నాగరాజు,కోశాధికారి అబ్బన్న,కార్యదర్శి గణేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారెడ్డి,సుదర్శన్,మల్లారెడ్డి,ఒడ్డేన్న,షబ్బీర్,కృష్ణారెడ్డి,మోహన్,నాగరాజు గౌడ్,సైదా గౌడ్,అబ్బయ్య,భూమయ్య,నర్సారెడ్డి,జిపి రాజు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









