Post Views: 122
రోడ్డు పై గాజుబుంగలు – లారీలు.. ప్రమాదాల పాలవుతున్న ప్రజలు…
ప్రజల కష్టాలు పట్టించుకోని బోధన్ మున్సిపాలిటీ…. నిత్యం ప్రమాదమయే మార్గం – మున్సిపల్ అధికారులు మౌనం.
బోధన్ పట్టణం:
బోధన్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తమ పంటలతో కూడిన వాహనాలతో వెళ్తున్నప్పుడు రహదారులపై పడిన గాజుబుంగలు, ఎక్కడికక్కడ నిలిపివేసిన లారీలు పెద్ద అడ్డంకిగా మారాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు.
రహదారులపై పడి ఉన్న గాజు ముక్కలు వాహనాల టైర్లను పగులగొడుతుండగా, రైతులు మరియు సాధారణ ప్రయాణికులు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు. లారీలు రోడ్లను ఆక్రమించడం వల్ల వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారు.
ప్రజలు మున్సిపాలిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని, రోడ్లపై గాజుబుంగలు, లారీలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మరింత ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









