May 3, 2026 1:06 am

V1News Telangana

టాస్క్ ఫోర్స్ ఖాళీ.. కమిషనర్ సాయి చైతన్య సడన్ షాక్..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అసాంఘిక కార్యకలాపాలపై కత్తి.. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బదిలీ..

 ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిపై బాస్ కన్ను.. బదిలీల తుఫాన్..

 సింహస్వప్నం టాస్క్ ఫోర్స్ ఖాళీ – పోలీస్ శాఖలో చర్చనీయాంశం..

 పత్తాలాట, మట్కా, ఆన్‌లైన్ గేమింగ్.. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఆరోపణల జాడలు.

నిజామాబాద్, ఆగస్టు 18:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు సింహస్వప్నంలా నిలిచిన టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఊహించని విధంగా బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి ఇదే మొదటిసారి టాస్క్ ఫోర్స్ ఖాళీగా మారడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.
ఈ క్రమంలో సిఐ అంజయ్యను సీసీఆర్బీకి, ఎస్సై గోవింద్ను ఆర్మూర్కు, శివరాంను సీసీఆర్బీకి బదిలీ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డిని సీసీఆర్బీకి, లస్మన్నను భీమ్గల్ పీఎస్కు, సుధీర్ను రెంజల్ పీఎస్కు, అనిల్ కుమార్ను సీసీఎస్‌కు, రాజును బోధన్ టౌన్కు, సచిన్ను భీమ్గల్‌కు, అన్వర్ను బోధన్ టౌన్కు, అనిల్ శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. తక్షణమే ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు.
గతంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయనను సస్పెండ్ చేయగా, ఆ తరవాత సిసిఎస్ ఏసీపీ నాగేందర్ చారీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయి పత్తాలాట, మట్కా, ఆన్‌లైన్ గేమింగ్, పీడీఎస్ దందాలు, గంజాయి స్మగ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు మామూల్లు తీసుకుని మూగవహిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది.
Oplus_16908288
పోలీస్ బాస్ కఠిన నిర్ణయం నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఖాళీ కావడం, మొత్తం కొత్త సిబ్బందిని నియమించి ప్రక్షాళన చేపట్టబోతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more