Post Views: 125
భక్తి రసభరితంగా ఆత్మలింగేశ్వర స్వామి సేవలు…
. పాండుచేరువు ఒడ్డున భజన కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం.
బోధన్, ఆగస్టు 18:
పవిత్ర శ్రావణమాసం సోమవారం సందర్భంగా బోధన్ శివారులోని పాండుచేరువు ఒడ్డున గల శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో పండితుడు సోను పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తి భావంతో భజన, కీర్తనలు నిర్వహించారు. ప్రతి సోమవారం ప్రత్యేక పూజల అనంతరం భజన కీర్తనలు కొనసాగించడం ఆనవాయితీగా జరుగుతోందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అందుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







