May 3, 2026 1:00 am

V1News Telangana

హుంసా, సాలురలో జయధ్వానాలతో జన్మదిన వేడుకలు – నేతపై అభిమాన జనహారతి . మండలమంతా ఉత్సవంగా మారింది – శుదర్శన్ రెడ్డికి అభిమానుల సంబరాల పూరిత శుభాకాంక్షలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలుర మండలంలో ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు..సాలుర మండలంలో ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

 

హుంసా, సాలురలో జయధ్వానాలతో జన్మదిన వేడుకలు – నేతపై అభిమాన జనహారతి

. మండలమంతా ఉత్సవంగా మారింది – శుదర్శన్ రెడ్డికి అభిమానుల సంబరాల పూరిత శుభాకాంక్షలు

. జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో ఘనత

. పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించిన శుదర్శన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

 

 

 

 

సాలుర, ఆగస్టు 2:

ఈరోజు సాలుర మండలమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. మన ప్రియతమ నేత, మాజీ మంత్రి, బోధన్ శాసన సభ్యులు శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని సాలుర మండల కేంద్రంతో పాటు హుంసా గ్రామంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి.

 

పెద్దల ఆధ్వర్యంలో, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.

 

ఇందులో భాగంగా కొంతమంది గ్రామ పెద్దలు మాట్లాడుతూ –

“మన నాయకుడు రైతులకు, పేదలకీ అండగా నిలిచే నిజమైన ప్రజానేత. ఆయన పుట్టినరోజును సేవా దినంగా మార్చుకోవాలని భావించి ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం” అని పేర్కొన్నారు.

 

వీధులపై కరతాళ ధ్వనులతో, బ్యానర్లు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షల తోరణాలతో జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. హుంసా ప్రాంతంలో విద్యార్థులకు పుస్తకాలు, పేదలకు దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఈ వేడుకలు ఎమ్మెల్యే గారిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించాయి.
ఉప్పు నరేందర్
Author: ఉప్పు నరేందర్

📢 ఉప్పు నరేందర్ 📰 బోధన్ రూలర్ రిపోర్టర్ 📞 సంప్రదించవలసిన నంబర్ : 9515361229

Leave a Comment

Read more
Read more