వీ1 న్యూస్, సూర్యాపేట జిల్లా – తుంగతుర్తి నియోజకవర్గం:-ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా రేపు (జూలై 14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారితో కలిసి కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా అర్హులకు చేరాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది ప్రజా ప్రభుత్వం.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. పేదల ఆకలి తీరేలా, సంక్షేమ పథకాలు అందేలా ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం శ్లాఘనీయం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








