V1News Telangana

best news portal development company in india

రామగుండం నగర పాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో అగ్రస్థానం మిగతా కార్పొరేషన్ల కంటే రామగుండంమే బెస్ట్

SHARE:

రామగుండం నగర పాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో అగ్రస్థానం మిగతా కార్పొరేషన్ల కంటే రామగుండంమే బెస్ట్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మే 08:-
రామగుండం నగర పాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఆస్తి పన్ను వసూళ్లలో రామగుండం నగర పాలక సంస్థ అద్భుత ప్రతిభ కనబరిచి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో మొదటి స్థానంలో, రాష్ట్రంలోని 151 పట్టణ స్థానిక సంస్థలలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 30 వరకు ఉన్న ఐదు శాతం రాయితీ గడువును మే 7 వరకు పొడిగించగా, 51,033 అసెస్‌మెంట్ల నుంచి రూ.19.14 కోట్ల డిమాండ్‌లో రూ.9.7 కోట్లు వసూలు చేసింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ నేతృత్వంలో సిబ్బంది కృషి ఫలించింది. డిప్యూటీ కమిషనర్ వెంకట స్వామి, ఆర్‌ఓ ఆంజనేయులు తదితరులను అభినందించారు.
Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india