నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సాయి చైతన్య, ఐ.పి.యస్ గారు, నేడు మధ్యాహ్నం బోధన్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన స్టేషన్ లోని పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ, మరియు ప్రజలకు అందించే సేవలపై సమీక్ష జరిపారు.
కమీషనర్ గారు రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ విభాగం పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో 5S విధానం అమలవుతున్నదా అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. వాహనాల పార్కింగ్, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, హెల్మెట్ వినియోగంపై సూచనలు చేశారు.
అలాగే గంజాయి వినియోగం నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, బానిసలుగా మారుతున్నవారికి కౌన్సిలింగ్ కల్పించాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గెమింగ్ అప్లికేషన్‌ల వల్ల మోసపోవడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ పర్యటనలో బోధన్ ACP శ్రీనివాస్, SHO వెంకట నారాయణ గార్లు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






