May 3, 2026 3:07 am

V1News Telangana

హనుమాన్ జయంతి ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి: పోలీస్ కమీషనర్ సమీక్ష . శాంతియుతంగా ర్యాలీ నిర్వహించండి: నిర్వాహకులతో సమన్వయ సమావేశం . ర్యాలీ మార్గాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు . డ్రోన్ల నిషేధం, శాంతిభద్రతలపై స్పష్టమైన మార్గదర్శకాలు . హనుమాన్ జయంతి ర్యాలీపై పోలీసులు అప్రమత్తం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాదు, ఏప్రిల్ 11:
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో ఏప్రిల్ 12న జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి ర్యాలీకి సంబంధించి నేడు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారు బోధన్‌లోని అప్నా ఫంక్షన్ హాల్ లో వివిధ సంఘాల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ర్యాలీకి సంబంధించిన నిబంధనలు, భద్రతా చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించడంతో పాటు, ఇతరులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రోన్ల వినియోగాన్ని నిషేధించారు.

అనంతరం కమిషనర్ గారు పోలీసు అధికారులతో కలిసి ర్యాలీ జరిగే మార్గాన్ని పరిశీలించారు.
ఈ సమావేశంలో బోధన్ ACP శ్రీ పి. శ్రీనివాస్
, SHO బోధన్ టౌన్ వెంకట్ నారాయణ, రూరల్ CI విజయ్ బాబు, ట్రాఫిక్ CI చందర్ రాథోర్డ్, రుద్రూర్ CI కృష్ణ ,
రూరల్ SI మచ్చందర్ రెడ్డి , ఏడపల్లి SI వంశీ, రెంజల్ SI చంద్ర మోహన్, వర్ని SI మహేష్, రుద్రూర్ SI సాయన్న, కోటగిరి SI సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more