హైదరాబాద్, ఏప్రిల్ 11:
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం (ఏప్రిల్ 12) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ట్రై కమిషనరేట్ పరిధిలో చిన్న పెద్ద హనుమాన్ జయంతి శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మద్యం విక్రయం, సేవనంతో శాంతిభద్రతలకు భంగం కలగవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, ఏప్రిల్ 12 ఉదయం 6 గంటల నుంచి, ఏప్రిల్ 13 ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
పౌరులు ఈ ఆదేశాలను గౌరవించి, శాంతియుతంగా హనుమాన్ జయంతిని జరుపుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






