V1News Telangana

best news portal development company in india

హనుమాన్ జయంతి ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి: పోలీస్ కమీషనర్ సమీక్ష… శాంతియుత ర్యాలీకి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు… . పోలీస్ కమిషనర్ చైతన్యతో హనుమాన్ జయంతి ర్యాలీ నిర్వాహకుల సమన్వయ సమావేశం… . చట్ట విరుద్ధ చర్యలకు తావు లేదు: పోలీస్ కమీషనర్ హెచ్చరిక.. ర్యాలీ సమయంలో డ్రోన్ల నిషేధం: కమీషనర్ ఆదేశాలు

SHARE:

నిజామాబాద్, ఏప్రిల్ 10: హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న నిర్వహించబోయే ర్యాలీకి సంబంధించి, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ర్యాలీ ఆర్గనైజర్లతో సమన్వయ సమావేశం జరిగింది. కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ర్యాలీ సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలపై చర్చ జరిగింది.

ర్యాలీ కంటేశ్వర్ నుండి ఆర్ ఆర్ చౌరస్తా వరకు నిర్వహించనుండగా, ప్రజలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆయన సూచించారు. చట్టవ్యతిరేక చర్యలు సహించబోమని, ఏ వ్యక్తి అయినా శాంతి భద్రతలను భంగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రోన్ల వినియోగం పూర్తిగా నిషేధించినట్టు వెల్లడించారు.

ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, ఆర్య సమాజ్, ఏబీవీపీ, హిందు వాహిని తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

సమావేశానికి ట్రైనీ ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక, అదనపు పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రావు, ఇంచార్జి అదనపు డీసీపీ మస్తాన్ అలీ, ACP రాజా వెంకట్ రెడ్డి, తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

 

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india