V1News Telangana

best news portal development company in india

మాక్లూర్ లో ఘరానా దొంగ అరెస్ట్ – 91 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ జల్పాలకు అలవాటు – పక్కా దొంగతనాలతో 12 కేసుల్లో నిందితుడికి అడ్డుకోలేని నడక నిజామాబాద్ పోలీసుల నైపుణ్యం – నాందేవ్ అరెస్ట్, బంగారం రికవరీ . మాధాపూర్ దొంగతన కేసు పరిష్కారం – నిందితుడు జ్ఞానేశ్వర్ అరెస్ట్ . ACP ఎల్.రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక ముద్దుపట్టింపు

SHARE:

జల్పాలకు అలవాటు పడి దొంగతనాల పాల్పడుతున్న ఘరానా నిందితుడు నాందేవ్ ఆనందరావు ముండాకర్ అలియాస్ జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ డివిజన్‌లోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో మొత్తం 91 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు.

ఈ రోజు ఉదయం మాణిక్ బండారు చెక్‌పోస్ట్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో SI రాజశేఖర్ నేతృత్వంలో అదుపులోకి తీసుకుని విచారించగా, మాధాపూర్ గ్రామంలో పరశు దేవానందం ఇంట్లో దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ దొంగతనంలో దొంగిలించిన 65 గ్రాముల బంగారాన్ని అతని వద్దనుండి రికవరీ చేశారు.

తదుపరి విచారణలో నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ మరియు వెల్మల్ గ్రామాల్లో జరిగిన దొంగతనాల్లో కూడా అతను పాలుపంచుకున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి మరో 26 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు.

నిందితుడు గతంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగతనాలకు సంబంధించి 12 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. ఇటీవలే జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేస్తూ పట్టుబడ్డాడు.

ఈ కేసును చేధించినందుకు ACP ఎల్.రాజా వెంకట్ రెడ్డి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్, SI రాజశేఖర్ మరియు సిబ్బందిని అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india