May 3, 2026 10:37 pm

V1News Telangana

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు…..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన ఎనలేని సేవలు

– అణగారిన వర్గాల, కార్మికుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహానీయుడు

– దళిత జాతిలో జన్మించినప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించిన వైనం

– ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఆకాంక్ష

– మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బాబూ జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, మాజీ ఉప ప్రధానిగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన అభ్యుదయ భావాలు కలిగి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా కార్మికుల, కర్షకుల అభివృద్ధికి తోడ్పాటు అందించిన గొప్ప నేత అని అభివర్ణించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడలలో ముందుకు కొనసాగుతూ సమాజ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ టేకుర్ల సాయిలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతిలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మరియు కార్మికుల శ్రమదోపిడిని ప్రశ్నించి వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కూతురు మీరా కుమారి ఐదు సంవత్సరాల పాటు లోక్ సభ స్పీకర్ గా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ఆయన గొప్ప మహనీయుడు నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని.. అలాంటి గొప్ప నేత యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత జాతి తరపున కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ సర్పంచ్ లు తర్నం శాంతయ్య, వనం వెంకటేశ్వర్ రావ్, నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, చుంచు పెద్ద సాయిలు, కోదండ రామారావ్, దేశ్ పాక్ సాయిలు, అల్లం గంగారం, టేకుర్ల వాసు, తర్ణం పోచయ్య, అశోక్, టేకుర్ల మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more