Post Views: 152
ఓలా గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజశేఖర్, రంజిత్, రాకేష్ కు చెందిన వడ్రంగి దుకాణం పూర్తిగా దగ్ధమై, లక్షలాది రూపాయల నష్టం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వెంటనే అక్కడకు చేరుకుని బాధితులను పరామర్శించారు.
అగ్ని ప్రమాదంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను ఓదార్చిన ఆయన, పునరావాసం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుంటాల మండల నాయకులు రమణారావుతో పాటు ఇతర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై కృతజ్ఞతలు తెలియజేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








