V1News Telangana

best news portal development company in india

బోధన్ ఏక చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహింపు

SHARE:

బోధన్ ఏక చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహింప

బోధన్: బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ ఏక చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయంలో అభిషేకాలు, హోమాలు, విశేష పూజలు చేపట్టారు. ఈ మహోత్సవంలో దాదాపు లక్షమందికి పైగా భక్తులు పాల్గొని భక్తి భావంతో పూజల్లో పాల్గొన్నారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అధికారులు, దాతలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు. ఆలయం చుట్టుపక్కల శుభ్రత, అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

భక్తుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడంతో పాటు భక్తి పరవశాన్ని కలిగించింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india