May 3, 2026 1:26 am

V1News Telangana

అల్లమా ప్రభు జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధం….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– ఈనెల 29వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభం

– భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి

– దేవాదాయ కమిటీ వెల్లడి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామ శివారులో కొండపై వెలసిన ఎంతో ప్రాచుర్యం కలిగిన స్వయంభు లింగం (అల్లమా ప్రభు) జాతర ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమవుతాయని దేవాదాయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 29వ తేదీ బుధవారం రోజు రాత్రి అగ్నిగుండం నిర్వహిస్తామని అన్నారు. 30 వ తేదీ గురువారం రోజు తెల్లవారుజామున రథోత్సవం.. అనంతరం ఉదయం నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 31వ తేదీ శుక్రవారం రోజు కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని.. ఎంతో మహిమాన్వితమైన స్వయంభు లింగాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుని పరమేశ్వరుడి కృపా కటాక్షాలను పొందాలని కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more