V1News Telangana

best news portal development company in india

పాత ఫెన్షన్ విధానాన్ని అమలు చేయాలి….

SHARE:

– UPS విధానం పై ఉపాధ్యాయుల వ్యతిరేకత

– ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

– తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

– PRTU మండల అధ్యక్షులు గునిగెరి హన్మండ్లు

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: PRTU రాష్ట్ర శాఖ ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయబోతున్న UPS విధానంలో చేర్చకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల లో భాగంగా మేనిఫెస్టోలో పొందుపరిచి నట్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని PRTU నసురుల్లాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఎల్.ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా PRTU మండల అధ్యక్షులు గునిగెరి హన్మండ్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల మరియు విద్యారంగ సమస్యల పరిష్కారానికి PRTU ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయని యెడల PRTU ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు శ్రీ చంద్, రాష్ట్ర బాధ్యులు వెంకా గౌడ్, హన్మండ్లు యాదవ్, కే. శ్రీనివాస్, మండల బాధ్యులు సంజీవులు, శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india