సాలూరా మండలం, ఫతేపూర్:
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫతేపూర్ గ్రామంలోని అభయాంజనేయ గణపతి సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు.
కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను కలిసికట్టుగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూ–ముస్లిం భాయి భాయి అనే సోదరభావానికి ఫతేపూర్ గ్రామం నిదర్శనంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు. మతసామరస్యం, ఐక్యత, పరస్పర గౌరవంతో గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోసిన్, షేక్ గౌస్, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








