డ్రిప్ ఇరిగేషన్‌తో నీటి పొదుపుపై అవగాహన
సాలోరా, సెప్టెంబర్ 19: గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం (RAWEP)లో భాగంగా జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు సాలు రా గ్రామంలోని రైతు రాజు గారి డ్రాగన్ ఫ్రూట్ తోటను సందర్శించారు. ఉద్యాన పంటల్లో సూక్ష్మ నీటి పారుదల (మైక్రో ఇరిగేషన్) విధానాలపై క్షేత్రస్థాయిలో అవగాహన పొందేందుకు ఈ సందర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు రాజు తన తోటలో అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ విధానం, నిర్వహణ పద్ధతులు, నీటి సమర్థ వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. డ్రిప్ ద్వారా మొక్కల వేర్ల ప్రాంతానికి అవసరమైన పరిమాణంలో నీటిని నేరుగా అందించడం వల్ల నీటి వృథాను తగ్గించుకోవచ్చని తెలిపారు.
విద్యార్థులు డ్రిప్ వ్యవస్థలోని వివిధ భాగాలను పరిశీలించడంతో పాటు నీటి పంపిణీ విధానం, మొక్కలకు నీటిని అందించే విధానం, ఉద్యాన పంటల్లో సూక్ష్మ నీటి పారుదల ప్రాధాన్యతపై రైతుతో చర్చించారు. నీటి వనరుల సంరక్షణతో పాటు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని విద్యార్థులు సూచించారు.
ఈ క్షేత్ర సందర్శన ద్వారా విద్యార్థులకు తరగతి గది, పుస్తక జ్ఞానంతో పాటు రైతు పొలంలో ప్రత్యక్ష అనుభవం లభించింది. డ్రాగన్ ఫ్రూట్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ వినియోగం, నీటి పొదుపు, వ్యవస్థ నిర్వహణపై విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన ఏర్పడింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







