-- --

బోధన్‌ పరిధిలో జోరుగా పేకాట.. అధికారులకు తెలియదా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

**పంట పొలాలు.. అడవి ప్రాంతాలు.. చెరువు గట్లే అడ్డాలు!

కవరింగ్‌ బాయ్‌లతో పహారా.. సమాచారం ఉన్నా చర్యలు ఎందుకు లేవన్న అనుమానాలు?**

బోధన్: బోధన్ పట్టణంతోమరియు అదేవిధంగా కొత్తపేట అడవి ప్రాంతంలో. పాటు పరిసర ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోందనే ఆరోపణలు, స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.   పట్టణ శివార్లతో పాటు పంట పొలాలు, అడవి ప్రాంతాలు, చెరువు గట్ల సమీపంలో, స్మశాన వాటికల పక్కన, మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో పేకాట స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సాలూరా మండలంలోని నాగంపల్లి–జాడి రహదారి పరిసర పంట పొలాలు, సాలంపాడ్–కుమ్మంపల్లి ప్రాంతాలు, సాలూరా గ్రామ పరిధి, ఫతేపూర్‌ శివారు, హుంసా–మందర్న–హెగడోళ్లి సరిహద్దు ప్రాంతాల్లోనూ పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాంతాల్లో వాస్తవంగా పేకాట జరుగుతోందా? అనే విషయాన్ని పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది.

కవరింగ్‌ బాయ్‌లతో పహారా?

పేకాట నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కవరింగ్‌ బాయ్‌లను ఏర్పాటు చేసుకుని, కొత్త వ్యక్తులు లేదా పోలీసులు వస్తున్నారా? అనే విషయాన్ని గమనిస్తున్నారని స్థానికుల నుంచి వినికిడి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం కష్టంగా మారుతోందని స్థానికులు అంటున్నారు.

పేకాటతో పాటు అధిక వడ్డీ అప్పులు?

పేకాట ఆడేందుకు వచ్చే వారికి తినుబండారాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారనే ప్రచారం ఉంది. డబ్బులు లేని వారికి అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి, వాహనాలు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కారణంగా పలువురు ఆర్థికంగా నష్టపోయి, కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయని కొందరు బాధితులు వాపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అధికారులకు తెలియదా? తెలిసినా చర్యలు ఎందుకు లేవు?

పేకాట ఎక్కడెక్కడ జరుగుతుందనే సమాచారం స్థానికంగా విస్తృతంగా చర్చకు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియదా? తెలిసి ఉంటే పూర్తి స్థాయిలో దాడులు ఎందుకు నిర్వహించడం లేదన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది అధికారులకు పేకాట నిర్వాహకుల నుంచి నెలనెలా ‘మామూళ్లు’ అందుతున్నాయనే వినికిడి, అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని, ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని వారు కోరుతున్నారు.

అధికారులకు సమాచారం అందించిన తర్వాతే పేకాట స్థావరాలకు విషయం చేరుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే సమాచారం ఎక్కడి నుంచి లీకవుతోంది? పేకాట నిర్వాహకులకు ముందస్తు సమాచారం అందుతున్నదా? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

నామమాత్రపు దాడులా.. పూర్తిస్థాయి చర్యలా?

అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కొద్దిమందిని అదుపులోకి తీసుకోవడం లేదా స్వల్ప మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించదని ప్రజలు అంటున్నారు. పేకాట వెనుక ఉన్న అసలు నిర్వాహకులు ఎవరు? వారికి ఆర్థికంగా సహకరిస్తున్నది ఎవరు? స్థావరాల సమాచారం ముందుగానే బయటకు వెళ్తుందా? అనే అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరుతున్నారు.

‘పేకాట స్థావరాలు ప్రజలకు కనిపిస్తుంటే.. అధికారుల కళ్లకు మాత్రం ఎందుకు కనిపించడంలేదు?’ అనే ప్రశ్న ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రజల్లో వ్యక్తమవుతున్న వినికిడి, ఆరోపణలు, అనుమానాలపై జిల్లా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే అది కూడా స్పష్టం చేయాలని, నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more