-- --

తెలంగాణలో మద్యం ధరలకు మళ్లీ మోత.. 20% వరకు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 త్రిసభ్య కమిటీ నివేదిక అనంతరం నిర్ణయం.. ప్రీమియం నుంచి చీప్ లిక్కర్ వరకు అన్ని బ్రాండ్లపై పెరిగే అవకాశం

హైదరాబాద్, జులై 17: తెలంగాణలో మద్యం ధరలు త్వరలో పెరగనున్నట్లు సమాచారం. మద్యం తయారీ సంస్థల విజ్ఞప్తులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ధరల పెంపునకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇటీవల వివిధ మద్యం తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది.

అనంతరం పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాల దృష్ట్యా మద్యం ధరలను సవరించాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సమాచారం ప్రకారం, మద్యం ధరలు సుమారు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై రూ.100 వరకు, హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120 వరకు, సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే చీప్ లిక్కర్ బ్రాండ్లపై రూ.90 వరకు ధరలు పెరగవచ్చని తెలుస్తోంది.

అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరల పెంపు అమలైతే మద్యం వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

🍾 “మద్యానికి అలవాటు పెరిగితే… ఖర్చుకు హద్దులు ఉండవు!”

💰 “ధర పెరిగినా మద్యం కాదు… తగ్గాల్సింది అలవాటే!”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more