*గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు:*
*ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి.ఎం వినోద్ కుమార్.*
*నిర్మల్ జిల్లా v1 * ప్రతినిధి ఫిబ్రవరి 21*
గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు తిసుకుంటున్నట్లు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి.ఎం వినోద్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ, గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే కమిటీ, నిర్మల్ జిల్లాలో పర్యటించిందని తెలిపారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులకు ఏ విధమైన పాలసీలు పాలసీలు రూపొందించాలన్న విషయంపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా తెలుసుకునేందుకు గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబాలతో వివరాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు ఆయా దేశాల చట్టాలు, కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. లైసెన్సులు కలిగిన ఏజెన్సీల ద్వారానే కార్మికులు విదేశాలకు వెళ్లేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ‘టామ్ కామ్’ ద్వారా కార్మికులకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని, దీనిపై గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలలో సమస్యల్లో చిక్కుకున్న కార్మికులకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
జిల్లాలో వినూత్నంగా గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఈ సమావేశంలో భాగంగా, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో గల్ఫ్ కార్మికుల సహాయార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న పలువురు కార్మికులను కలెక్టర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించగలిగినట్టు వివరించారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, సంబంధించిన వివిధ శాఖలు సమన్వయంతో పని చేస్తూ కృషి చేస్తున్నాయని తెలిపారు.
ఎన్ఆర్ఐ అడ్వైజరి కమిటీ బృందాన్ని, అధికారులని పలువురు శాలువాలతో సన్మానించారు.
ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాసరావు, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







