-- --

## పేద విద్యార్థులకు దాతల చేయూత.. మందర్న ప్రభుత్వ పాఠశాలలో టైలు, బెల్టులు, ఐడీ కార్డుల వితరణ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

### విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయం: సర్పంచ్ రావుబా సావిత్ర గంగాధర్…

బోధన్, నవంబర్ 5 (V1 న్యూస్): విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా సాలూర మండలం మందర్న గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీనివాస్, మేస్త్రీ బాలు ముందుకొచ్చారు. మందర్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం టైలు, బెల్టులు, ఐడీ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుబా సావిత్ర గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించి, వారి చదువుకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు చేయూతనివ్వడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పడటమే కాకుండా, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం కోసం దాతలు ముందుకు రావడం పాఠశాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా దాతలు సిరిగిరి శ్రీనివాస్, మేస్త్రీ బాలును గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వసంత, పంచాయతీ కార్యదర్శి శిల్ప, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more